సామల లలిత బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం
- -పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణం
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్లో గల టెలిఫోన్ కాలనీలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి సతీమణి లలిత వధువు ఇంటివారి స్థానంలో, గోషిక సాయి లీల వెంకటేష్ లు వరుడు ఇంటి వారి స్థానంలో నిలబడి స్వామివారిని వారి గృహాల నుండి కళ్యాణ మండపం లోకి తీసుకువచ్చి వారి చేతుల మీదుగా పురోహితుల వేదమంత్రాల సాక్షిగా పట్టు వస్త్రాలతో, ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ జడ్పిటిసి మంద సంజీవరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపు గత మూడు సంవత్సరాలుగా కళ్యాణ ని నిర్వహిస్తున్నామని సీతారాముల కళ్యాణం పవిత్రతకు, ఐక్యమత్యానికి, అన్నదమ్ముల అనుబంధానికి, న్యాయ ధర్మాలకు ప్రతీకలని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో టెలిఫోన్ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,సెక్రటరీ రమేష్ గౌడ్, టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.



