ఘనంగా మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు
విశ్వంభర, షాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మిత్రులు, సన్నిహితులు చేవెళ్ల నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ ఎమ్ ఆర్ అభిమానులు భారీ గజమాలను క్రేన్ సహాయంతో తీసుకొని వచ్చి మధుసూదన్ రెడ్డికి వేయడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కేక్ ని కట్ చేయించి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ సేన యువజన విభాగం అధ్యక్షులు బండ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



