అంబర్ పేటలో సీతారాముల కళ్యాణం

అంబర్ పేటలో సీతారాముల కళ్యాణం

విశ్వంభర, అంబర్ పేట : అంబర్‌పేటలో దేవస్థాన సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన సేవాసమితి ప్రతినిధులు తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకుని వెళ్లి స్వామివారికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: