ఆపరేషన్ రోప్‌తో పాదచారులకు సౌకర్యం

ఆపరేషన్ రోప్‌తో పాదచారులకు సౌకర్యం

విశ్వంభర, అమీర్‌పేట : ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదచారులకు సౌకర్యంగా మార్గాలు కల్పించారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అమీర్‌పేట ప్రాంతంలో డెల్టా–13 సిబ్బంది ఆపరేషన్ రోప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాదచారుల మార్గాలను ఆక్రమించి ఏర్పాటు చేసిన స్టాళ్లు, దుకాణాల ముందు ఉంచిన వస్తువులను తొలగించి ఫుట్‌పాత్‌లను స్వచ్ఛం చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర పోలీసు చట్టం 38(బి) కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 38 కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాదచారులకు ఈ చర్యలతో ఉపశమనం లభించిందని ట్రాఫిక్ సిబ్బంది పేర్కొన్నారు.

Tags: