ముద్దెంగూడలో ఘనంగా  రాములోరి కల్యాణం 

ముద్దెంగూడలో ఘనంగా  రాములోరి కల్యాణం 

విశ్వంభర, షాబాద్ : మండలంలోని ముద్దెంగూడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం  సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘాల ఉపాధ్యక్షులు పర్వేద నర్సింహులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పురాతన శివాలయం వద్ద సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం లో పరివేద నరసింహులు దంపతులు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరు వాడవాడలా ఊరేగిస్తూ భజనపరులతో కీర్తనలు చేసుకుంటూ మేళ తాళాలతో ఊరేగించి పురాతన శివాలయం వద్ద స్వామివారి కళ్యాణం వైభవంగా చేపట్టారు. స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ శివకుమార్, గ్రామ కమిటీ సభ్యులు అలాగే ఎక్స్ ఎంపీపీ కూన వెంకటయ్య, గ్రామ పెద్దలు పాపిరెడ్డి, ఎన్ లింగం,మాజీ సర్పంచ్ జయమ్మ సుదర్శన్, భూపతి సురేష్, పురుషోత్తం, కూన సత్యనారాయణ, ఒగ్గు నరసింహులు, శంకరయ్య, ఆర్ అంజయ్య, ఎన్ హనుమంతు, బి వెంకటేష్ గౌడ్, జిట్టా శ్రీనివాస్, బొబ్బిలిగామ నర్సింహులు, నరసింహులు, గ్రామ కమిటీ సభ్యులు భూపతి శ్రీశైలం, ఒగ్గు సుమలత మల్లేష్, జిట్టా భాగ్య శ్రీనివాస్, ఎండి కాజా, ఎన్ శైలజా శేఖర్ గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: