శిశుమందిర్ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవం

శిశుమందిర్ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవం

 విశ్వంభర, పెద్దశంకరంపేట: పెద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో శుక్రవారం శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్రమశిక్షణ దేశభక్తి జాతీయభావంతో కూడిన విద్యను శిశు మందిరాలలో అందించడం జరుగుతుందన్నారు. శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సరస్వతి విద్యాపీఠం స్థాపించడం జరిగిందని శిశు మందిరాల యొక్క విశిష్టత గురించి వివరించారు.. అనంతరం పప్పు పచ్చడి విద్యార్థులకు పెద్దలందరికీ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శిశు మందిర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాదిగారి గంగాధర్ క్రాంతి లాల్. ప్రబంధకారుని సభ్యులు పున్నయ్య జస్వంత్ టి రవీందర్. రవి వర్మ రాము ఆచార్యులు జైహింద్ రెడ్డి శ్రీనివాస్ మాతాజీలు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: