అన్నపూర్ణ కాలనీలో సీతారాముల కళ్యాణం
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలని కాలనీలో గల గణేష్ మండపం లో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ, ఎంతో ఘనంగా శ్రీ సీతారామ చంద్రుల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని,ఈ కార్యక్రమానికి దాదాపుగా 2000 మంది భక్తులు, కాలనీవాసులు హాజరై కల్యాణాన్ని తిలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అన్నపూర్ణ కాలనీలో జరుపుకుంటున్నామని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్న ప్రసాదాలను భక్తులకు అందజేశామన్నారు. కాలనీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, సాయిని అమృతం, అన్నపూర్ణ కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.



