వడ్లను గోటి తో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణము లో తలంబ్రాల బియ్యం ను సూర్యాపేట మండలం బాలేం ల గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత 3 నెలలు గా వడ్లను గోటితో వలవగా వచ్చిన బియ్యంలో ఒక కేజీ 250 గ్రా బియ్యాన్ని శుక్రవారం దేవాలయ కమిటీ కి అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ, గత 3 నెలలు ఎంతో నిష్టతో గోటితో వలచిన బియ్యాన్ని భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి కళ్యాణానికి, బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరంలో జరుగు కళ్యాణానికి కేజింబావు చొప్పున అందజేసి నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు బ్రాహ్మణపల్లి మురళీధర్, పబ్బా ప్రకాశరావు, దేవర శెట్టి సోమయ్య, దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం,భక్తులు పొద్దుటూరి నాగ ప్రసాద్,మహంకాళి కవిత, ఓరుగంటి కనక రత్నం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.



