భక్తి శ్రద్ధలతో  సీతారాముల కళ్యాణం 

భక్తి శ్రద్ధలతో  సీతారాముల కళ్యాణం 

విశ్వంభర, గోల్నాక : శ్రీరామనామ స్మరణతో సమాజంలో శాంతి, ఐక్యత పెరుగుతుందని మాజీ కార్పొరేటర్ తెలిపారు. గోల్నాక హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags: