సాయిబాబా జన్మదినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధిలోని బర్దిపూర్ శివారులోని మాధవ్ నగర్ లో గల సాయి బాబా ఆలయంలో స్వామివారి జన్మోత్స వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటి సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కాగా ఆలయంలో డోలికోత్సవం తో పాటు వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. సాయిబాబా జన్మోత్సవ వేడుకలు వైభవంగా చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని ఆకాంక్షించారు. అటు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ డిచ్ పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయి రెడ్డి, నాయకులు పొలసాని శ్రీనివాస్,ధర్మగౌడ్,హన్మండ్లు, తదితరులు పాల్గొన్నారు.



