స్వామి వారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే 

స్వామి వారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే 

విశ్వంభర,  హనుమకొండ: హన్మకొండ జిల్లా మడికొండ మెట్టుగుట్ట పవిత్ర శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే  కే.ఆర్. నాగరాజు, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.  శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఎమ్మెల్యే నాగరాజు ని ఆహ్వానించి వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే నాగరాజు ని  శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు , ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తి పరవశంలో, వైభవంగా కొనసాగగా, ఎమ్మెల్యే నాగరాజు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ,  శ్రీరామనవమి పర్వదినం మన భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యపాలనకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ పైడిపాల రఘుచందర్, రామాలయ చైర్మన్ పల్లపు అర్జున్, డైరెక్టర్స్, కాజీపేట మండలం అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మడికొండ నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Tags: