ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

విశ్వంభర , కుత్బుల్లాపూర్:  నియోజకవర్గం లోని  శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకు న్నారు. వేడుకల్లో భాగంగా కత్బుల్లాపూర్ సంజయ్ గాంధీనగర్, షాపూర్ నగర్, సూరారంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ బాలకృష్ణ హాజరై  రాములవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బాలకృష్ణ  మాట్లాడుతూ, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ఆకాంక్షించారు, ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు భక్తులు అధిక సంఖ్యలో శ్రీ సీతారాములవారి కళ్యాణ మహోత్సవానికి వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమలో స్థానిక వాసులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Tags: