30న లేబర్ కోడ్స్ ప్రతుల దగ్ధం #Draft: Add Your Title
- టియు సిఐ జిల్లా కమిటీ హెచ్చరిక
విశ్వంభర, మహబూబాబాద్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెట్టుబడిదారులకు అనుకూల లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, కార్మిక వర్గం, రైతాంగం, ప్రజానీకం తీవ్ర నిరసన వ్యక్తం చేసినా అమలకు పూనుకోవటం సరికాదని, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ న లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు , కార్యదర్శులు , కొత్తపల్లి రవి , బిల్లకంటి సూర్యం లు ఒక ప్రకటన లో తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్పొరేట్, గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులను యథేచ్ఛగా దోచుకోవటానికి మోడీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని , ఏప్రిల్ ఒకటి నుంచి అమలకు రంగం సిద్ధం చేసిందని అన్నారు . కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు వేతనాలు పెంచకపోతే సమ్మె చేసే హక్కు అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కును కోల్పోతున్నారని గుర్తు చేశారు . ఇది రాజ్యాంగ వ్యతిరేకమని , గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను ఇది పూర్తిగా కాలరాస్తున్నాయని అన్నారు . ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ మహిళలు రాత్రి వేళల్లో కూడా ప్రమాదకరమైన ఫ్యాక్టరీలలో పనిచేయటానికి అనుమతినిస్తున్న ఈ లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . కోట్లాదిమంది కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఈ నూతన లేబర్ కోడ్స్ కాంగ్రెస్ వ్యతిరేకించేది నిజమైతే వెంటనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లేబర్ కోడ్స్ అమలు చేయమని తీర్మానం చేయాలని వారు కోరారు.



