అట్టహాసంగా సీతారాముల కళ్యాణం
On
విశ్వంభర, హనుమకొండ: వడ్డేపల్లి లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన శ్రీ సీతారాములోరి కళ్యాణంకు ముఖ్య అతిథిగా స్థానిక 60 వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజారులు మణికొండ భాస్కర్ రావు, మనికొండ ప్రవీణ్ శర్మ, ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన వారిలో శ్యామల సుధాకర్, ఎస్.ప్రదీప్, ఎస్.ప్రమోద్, పెద్ది ప్రవీణ్, ప్రసాద్, రాజు, గణేష్, గణేశ్ ఉత్సవ కమిటీ, శ్రీ రామ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అనంతరం మహా అన్నదాన వితరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



