సీతారాముల కళ్యాణం...పులకరించిన భక్త జనం  

సీతారాముల కళ్యాణం...పులకరించిన భక్త జనం  

 విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు సింగపూర్ టౌన్షిప్ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం  సీతారాముల కళ్యాణం ఆలయ కమిటీ చైర్మన్ మెట్టు బాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ప్రజలు హాజరై  స్వామివారి కల్యాణి తిలకించారు.  ఆలయ కమిటీ చైర్మన్  మెట్టు లీల బాల్ రెడ్డి  మాట్లాడుతూ   అయోధ్య భద్రాచలంలో జరిగే సమయానికి  రాముల వారి కళ్యాణం వేద పండితుల  మధ్య    సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి రాములవారితో సీతమ్మ మెడలో వేద పండితుల సమక్షంలో తాళి కట్టించారు ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించిపోయారు ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సీతమ్మ రాములవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు కల్యాణ మహోత్సవం అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: