విద్యార్థుల బృందం మానవ నిర్మిత అడవి సందర్శన 

విద్యార్థుల బృందం మానవ నిర్మిత అడవి సందర్శన 

విశ్వంభర, రామన్నపేట: భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, 52 మంది విద్యార్థులతో కలిసి సూర్యాపేట జిల్లా చివ్వెంల సమీపంలో ఉన్న ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ సృష్టించిన అడవిని సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఏమాత్రం స్వార్థం లేకుండా తనకున్న 70 ఎకరాల భూమిని అడవిగా చేసిన మహనీయుడు దుశ్చర్ల సత్యనారాయణ అని, ప్రకృతి పట్ల వారికున్న ప్రేమను ఈ అడవి తెలియజేస్తుందని అన్నారు. ప్రకృతి వనం సందర్శనలో భాగంగా దుశ్చర్ల సత్యనారాయణ సృష్టించిన అడవి గురించి విద్యార్థులు వివరంగా తెలుసుకున్నారు. చెట్లు, మొక్కలు, వివిధ జీవజాతులు ఎలా సహజ సిద్ధంగా పెరుగుతాయో విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వలన మనిషికి కలిగే అనేక లాభాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్శన సమయంలో జగదీశ్ సహాయకులుగా వ్యవహరించి, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. తదనంతరం సూర్యాపేట మున్సిపాలిటీ కమిటీ హాలులో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులు శిక్షణ పొందారు. పర్యావరణ నిపుణుడు సాయి ప్రసాద్ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయు విధానం, మరియు వాటి ద్వారా ఉపయోగకరమైన వర్మి కంపోస్ట్, ఇటుకలు తయారుచేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వర రావు, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు, అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్.వెంకటేశ్వర్లు, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ పి.బ్రహ్మం, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి.శ్రీనివాస్, ఆంజనేయులు, అమర్, నరేష్, రాధిక, రవి మరియు అధ్యాపకేతర సిబ్బంది షరీఫ్, ఆంజనేయులు, నవీన్ లతో పాటు డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: