అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణం 

అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణం 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని అక్కన్న మాదన్న గడికోటలో శ్రీ రాములవారి కళ్యాణం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ముందు స్వాములవారిని గ్రామంలో ర్యాలీనిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం  సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ప్రజలు హాజరైయ్యారు. రాముల వారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య  సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి రాములవారితో సీతమ్మ మెడలో వేద పండితుల సమక్షంలో తాళి కట్టించారు.  ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సీతమ్మ రాములవారిని మనస్ఫూర్తిగా  కోరుకున్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ  గ్రామాల్లో సర్పంచ్లు వార్డు మెంబర్స్ , మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, మహిళలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: