వివేక్‌నగర్‌లో సీతారాముల కళ్యాణం

వివేక్‌నగర్‌లో సీతారాముల కళ్యాణం

విశ్వంభర, గాంధీనగర్ : శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. హైదరాబాదు  గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: