బర్త్ డే ఖర్చు రూ.100 

బర్త్ డే ఖర్చు రూ.100 

  • -120 మామిడి మొక్కలు బహుమతి
  • -ఆదర్శ రైతు పెండెం

విశ్వంభర, ఇనుగుర్తి: బర్త్ డే వచ్చిందంటే  ఆడంబరాలతో జేబులు గుల్ల చేసుకునే ప్రస్తుత పోకడలో కేవలం 100 రూపాయల ఖర్చుతో తన మామిడి తోటలో మనుమడి  బర్త్ డే జరిపాడు జిల్లా ఆదర్శ రైతు పెండెం వెంకన్న పటేల్. ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన వెంకన్న పటేల్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వ్యవసాయం అంటే అందులో ఆర్గానిక్ సాగు ఆయనకు ప్రాణం. మనుమడి  పుట్టినరోజు పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని నిరాడంబరంగా జన్మదిన వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా 120 మామిడి మొక్కలను మనుమనికి బహుమతిగా ఇచ్చాడు. బర్త్ డే పై వెంకన్న పటేల్ మాట్లాడుతూ, జన్మదిన వేడుకలతో పాటు, ఇతర వేడుకలకు ప్రెస్టేజ్ కి పోయి వేలు, లక్షల్లో ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదని భావించి ఈ విధంగా చేసినట్లు తెలిపారు. తాను గిఫ్ట్ గా ఇచ్చిన మామిడి చెట్లు మా మనుమడు ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి పెరిగి ఫలాలను ఇస్తాయని, ఈ ఆదాయం విద్యకు అవసరమవుతుందన్నారు.

Tags: