కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి
విశ్వంభర, నాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాజుల వీరయ్య అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన బొడ్డు వెంకన్న గత ఏడాది ఆసుపత్రి లో చేరి చికిత్స అయిన అనంతరం కోలుకొని ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా ఖర్చు అయిన 3 లక్షలకుగాను ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం తో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 60,000 మంజూరు కాగా జిల్లా కాంగ్రెస్ నాయకులు జాజుల వీరయ్య గారి సహకారం తో లబ్ధిదారుడు బొడ్డు వెంకన్న కు ఫణిగిరి సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి గసమక్షంలో లో అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందని అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ వల్లాల భాను , గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి మందుల వెంకన్న ఎర్ర అల్లేయ్యా పాల్గొన్నారు.



