సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం కొలనుగూడ గ్రామం పెద్దల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరు స్వామివారి ని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. మనసులో ధర్మం వెలిగితే ప్రతి శ్వాసలో శ్రీరాముడు అదే నిజమైన రామనవమి ఉత్సవం. భక్తి అనేది కేవలం ప్రార్థన కాదు అది జీవితం నడిపే మార్గదర్శి.ఇంటి లో శాంతి, మాటలో నిజాయితీ, హృదయంలో విశ్వాసం ఇవే శ్రీరాముని ఆశీర్వాదాల రూపాలు,ప్రతి మనసులో రాముడు నివసిస్తే ప్రతి రోజు శ్రీరామ నవమి అవుతుంది బంగారంలోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది, తర తరాలకుఆదర్శనీయమైనది, సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని చెప్పారు. ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ సర్పంచు మాజీ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకకు విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.



