10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు.- యువ నాయకుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి
On
విశ్వంభర, షాబాద్:ఈరోజు ప్రారంభమైన పదవ తరగతి (SSC) వార్షిక పరీక్షలను రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు యువ నాయకుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలను రాయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షల్లో చక్కగా చూపించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తు విజయాలకు తోడ్పడాలని కోరారు. ఈ పరీక్షల్లో ప్రతి విద్యార్థి విజయం సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.



