మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
On
విశ్వంభర, కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, మండల నాయకులు మార్కెట్ డైరెక్టర్స్, వార్డ్ కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.



