అంకిరెడ్డి పల్లెలో బండి సంజయ్ పర్యటన – నిధుల కోసం సర్పంచ్ వినతి పత్రం

అంకిరెడ్డి పల్లెలో బండి సంజయ్ పర్యటన – నిధుల కోసం సర్పంచ్ వినతి పత్రం

 తంగళ్ళపల్లి( విశ్వoభర ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిధుల లేమితో నిలిచిపోతున్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆమె అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆశాని శ్రీకాంత్ రెడ్డి, జిందం సంతోష్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: