భక్తిశ్రద్ధలతో సీతారాముల కళ్యాణం
On
విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలు, తండాలలో శ్రీ సీతా రామచంద్రుల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బ్రాహ్మణ కొత్తపల్లిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ నేతృత్వంలో వేద బ్రాహ్మణులు సంపత్ కుమారాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య రాములోరి పరిణయం నిర్వహించారు. పులిహోర వితరణ చేశారు. ఉపసర్పంచి పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కాస్య తండాలో సర్పంచ్ బోడ నర్సింహ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు.భక్తులకు మహాన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తండావాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో సర్పంచులు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.



