వైభవంగా  శ్రీరామనవమి వేడుకలు 

వైభవంగా  శ్రీరామనవమి వేడుకలు 

విశ్వంభర, నల్లకుంట :  అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబర్‌పేట, పటేల్ నగర్, బాగ్ అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పుర, గోల్నాక, నల్లకుంట, తిలక్ నగర్ డివిజన్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. నల్లకుంట డివిజన్ ఓల్డ్ రామాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, మాజీ టీపీసీసీ కార్యదర్శి లక్పతి యాదగిరి జ్యోతి గౌడ్ హాజరయ్యారు. తిలక్ నగర్ డివిజన్ గోల్నాక కూరగాయల మార్కెట్ హనుమాన్ దేవాలయం వద్ద భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో లక్పతి యాదగిరి జ్యోతి గౌడ్ దంపతులు పాల్గొని సేవలు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్ హరినాథ్ రెడ్డి, తోలుపునూరి కృష్ణ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, సాయి కిరణ్, అనిల్ కుమార్, లక్ష్మణ్ , రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: