10కేజీల గంజాయి పట్టివేత .. ముగ్గురు అరెస్ట్ 

10కేజీల గంజాయి పట్టివేత .. ముగ్గురు అరెస్ట్ 

 విశ్వంభర,  జిహెచ్ఎంసి :  సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ప్రాంతంలో పెట్రోల్ బంకు వద్ద నాంపల్లి ఏరియాలో ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి గంజాయి అమ్మకాలపై తనిఖీలు చేపట్టారు.  ఈ తనిఖీల్లో 10.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పై కేసు నమోదు చేశారు. వీరిలో హేమా చంద్రకాంత్ హట్ వాలే (మహారాష్ట్ర), సాకేత్ శంకర్, కసాబ్ రాజు అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో శివరాజ్, హట్ గడ అక్షయ్, జావేద్ అనే ముగ్గురు నిందితులు కూడా ఉన్నట్లుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు హెచ్డిఎఫ్సి లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నిందితులను గంజాయిని నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.

Tags: