గుంటి జంగయ్య కాలనీలో ఘనంగా  సీతారాముల కళ్యాణం 

గుంటి జంగయ్య కాలనీలో ఘనంగా  సీతారాముల కళ్యాణం 

విశ్వంభర, హైదరాబాద్ : ఎల్బీ నగర్ లోని గుంటి జంగయ్య కాలనీలోని శ్రీ శ్రీ విజయ  దుర్గాంబికా దేవాలయం ఆవరణలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవముగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ ఆధ్వర్యములో నిర్వహించిన ఈ కార్యక్రములో శ్రీ వెంకటేశ్వర వెల్ఫెర్ అసోసియేషన్ , గుంటి జంగయ్య కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ సందర్భముగా  ఊదరి గోపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కాలనీలోని అందరం కుటుంబ సభ్యులుగా  అంగరంగ వైభవముగా శ్రీ సీత రాములవారి కల్యాణాన్ని జరుపుకుంటామని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో మేమందరం కలిసి మెలిసి ఉంటూ ఎంతో ప్రశాంత వాతావరణములో  ఆనందముగా ఉంటున్నామని తెలిపారు.శ్రీ రాముల వారి కల్యాణాన్ని రెండు రోజుల పటు కాలనిలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ వెంకటేశ్వర వెల్ఫెర్ అసోసియేషన్ వారికీ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలిపారు . అనంతరం భక్తులకు అన్నదానం తో పటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమములో కాలనీవాసులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: