సంతోషిమాత ఆలయంలో సీతారాముల  కళ్యాణం

సంతోషిమాత ఆలయంలో సీతారాముల  కళ్యాణం

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని  శ్రీ సంతోషిమాత దేవాలయం లో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ తంతును శాస్త్రో క్తంగా నిర్వహించారు. శుక్రవారం కావడంతో శ్రీ సంతోషిమాతకు తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు . అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రానికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కళ్యాణం ఆసాంతం తిలకించారు. ఉద్యాపన ఒడిబియ కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం వడపప్పు బెల్లం పానకం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశరావు కోశాధికారి కొత్త మల్లికార్జున్ ఉపాధ్యక్షులు బెలీదే అశోక్ తాళ్లపల్లి రామయ్య, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్ ,నూక రవిశంకర్, శివప్రసాద్, నాగమణి, పద్మ, సూర్య కళ, పల్లవి,కవిత, లీల, నీరజ , భవాని ,శివ పార్వతీ,దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tags: