శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీలో సీతారాముల కల్యాణ వేడుకలు
విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లోని శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, కాలనీ అధ్యక్షులు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ పోగుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ,మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ, ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రీ సాయి ఎన్క్లేవ్ కాలనీలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని, ఈ కళ్యాణ మహోత్సవంలో కమిటీ సభ్యులు మమేకమై కల్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు వారి సొంత నిధులతోనే నిర్వహించామని, దాదాపు 1,000 మందికి పైగా స్వామివారి కల్యాణ భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా కాలనీ వాసులు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణం ఘనంగా నిర్వహించామని దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బొమ్మ కళ్యాణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాటపల్లి రామచంద్రారెడ్డి, చక్రపాణి గౌడ్, బంధారం శ్రీధర్ గౌడ్, కో చైర్మన్ అంజయ్య, కోశాధికారి రాజేందర్, జనరల్ సెక్రెటరీ వెంకటరమణ, సంజీవరావు, విద్యాసాగర్, దయాకర్,కృష్ణమూర్తి, రామరాజు, శ్రీనివాస్ రెడ్డి, శివప్రసాద్, మైపాల్ రెడ్డి, భార్గవి, కిషన్, రమేష్ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



