శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు 

శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు 

విశ్వంభర, అంబర్ పేట : శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలకు శాంతి, సుభిక్షం కలగాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  తెలిపారు. అంబర్‌పేట డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బిక్షపతి, లవంగు ఆంజనేయులు, రజినీకాంత్ గౌడ్, రత్నపాని, యశ్వంత్, నాగరాజు (చిన్న), అనిల్, రవి, తిరుమలేష్, బాలరాజ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, నాగరాజు, మామిడాల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

Tags: