చిక్కడపల్లిలో ఘనంగా సీతారాముల కళ్యాణం 

చిక్కడపల్లిలో ఘనంగా సీతారాముల కళ్యాణం 

విశ్వంభర, చిక్కడపల్లి : శ్రీరాముని ఆశీస్సులతో సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని బీజేపీ నాయకులు తెలిపారు. చిక్కడపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాతిరి పార్థసారథి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: