అంగరంగ వైభవంగా రాములోరి పెళ్లి
విశ్వంభర, పెద్ద శంకరంపేట: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని పెద్ద శంకరంపేట లోని రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే అనుపమ రెడ్డి సంజీవరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. పేట పట్టణంలోని పలువురు ప్రముఖులు భక్తులు సైతం స్వామివారికి ముత్యాలు తలంబ్రాలు పట్ట వస్త్రాలను సమర్పించారు. రామాలయంలో ఎమ్మెల్యే దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో సీతారాముల కళ్యాణం మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు కళ్యాణ మహోత్సవం తిలకించడంతోపాటు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో మహిళలు చిన్నారులు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు



