అనంతగిరి మండల పాస్టర్ నూతన కమిటీ 

అనంతగిరి మండల పాస్టర్ నూతన కమిటీ 

విశ్వంభర,  అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో కర్మల్ ప్రార్థన మందిరం ఆవరణంలో కోర్ కమిటీ చైర్మన్ రేవరెండ్ డాక్టర్ శ్రావణ్ కుమార్, డిసిప్లేన్ కమిటీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య, నియోజకవర్గ అధ్యక్షులు  రామారావు వైస్ చైర్మన్,  గుడిబండ ఏసయ్య  ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎంపిక చేసారు. కోర్ కమిటీ వర్కింగ్ చైర్మన్గా శ్రీనివాస్ గౌడ్, చీప్ కోఆర్డినేటర్ గా రూపుస్ నాయక్ ఎన్నికయ్యారు. అనంతగిరి మండల కమిటీ అధ్యక్షులుగా పాస్టర్ ఈ రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాస్టర్ జాన్ వెస్లీ , ఉపాధ్యక్షులుగా పాస్టర్ ఏ ఆదాము, కార్యదర్శిగా పాస్టర్ సామ్యూల్ కిరణ్, సహాయ కార్యదర్శి పాస్టర్ రవి, కోశాధికారిగా పాస్టర్ బాబురావు , జాయింట్ కోశాధికారిగా పాస్టర్ విజయ్,  చీప్ కోఆర్డినేటర్ గా వై ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ వై లాల్ బహుదూర్ ,సత్యం జయరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags: