బర్కత్ పుర లో ఘనంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, బర్కత్ పుర : హైదరాబాదు బర్కత్ పుర రత్నానగర్ బస్తీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఆర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో కమిటీ సభ్యులందరి సహకారం ఉందన్నారు. ప్రెసిడెంట్ ఆర్ పోచాలు, వైస్ ప్రెసిడెంట్ ఏం సతీష్ చంద్ర గౌడ్, ప్రధాన కార్యదర్శి బి ఆర్ రవీందర్, సంయుక్త కార్యదర్శి ధనుష్, కార్యదర్శులు ఆనంద్, కప్పల శ్రీనివాస్, కోశాధికారి పాతకోటి మహేష్ సమన్వయంతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తండు లాలయ్య, పి ఈశ్వర్, గణపతి, జి కృష్ణ, రఘు, హరీష్, వీరప్ప, ప్రశాంత్, వెంకటేష్, రాజేష్ లాల్, రాజు, మహేందర్ యాదవ్, నాగరాజు, శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



