చీకటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి
ఎస్ కెఎం డిమాండ్
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో పెరుమామాళ్ల జగన్నాథం భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు . ఈ సదస్సు నల్లపు సుధాకర్ అధ్యక్షతన జరిగింది . ఈ సదస్సు కి వక్తలుగా హాజరై ఎస్ కె ఎం జిల్లా కన్వీనర్ గుజ్జు దేవేందర్ , ఏఐపీకేఎం యు రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న చంద్రన్న ,ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రాజన్న, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల సాయన్న, ఏఐకేఎంఎస్ సనప పొమ్మన్నలు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో , యూనియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో చేసుకున్న చీకటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని , భారతదేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకువెళ్లి తప్పుడు ఒప్పందాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని దీనిపై రైతాంగం మార్చి 10 నుండి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా దశలవారు ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. మన జిల్లాలో మండల కేంద్రాలలో తహసిల్దారులకు వినతి పత్రాలను ఎస్కేయం ఆధ్వర్యంలో అందజేయాలని ,మార్చి 30 న స్థానిక ఎమ్మెల్యే , ఎంపీ, కలెక్టర్ ల కి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వలన భవిష్యత్తులో జరగబోయే నష్టాల తీవ్రత గురించి వారి దృష్టికి తీసుకు వెళ్తూ వినతి పత్రాలు అందజేయాలని, వచ్చే ఏప్రిల్ 13న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరుగు మహాధర్నాకు జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు రైతు కూలి సంఘాలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన బివిజి రాంజీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని పాత మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలవాల వీరన్న , బండపల్లి వెంకటేశ్వర్లు, దంతోజు ఉపేంద్ర చారి , ఎడ్ల మల్లయ్య, అరుణోదయ రాష్ట్ర కన్వీనర్ బత్తుల పాపారావు, బొమ్మల చిట్టిబాబు, జవాజి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు .



