సిరిపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

సిరిపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా,  రామన్నపేట మండలంలోని సిరిపురం లో శ్రీ సీతారాముల కళ్యాణం దేవస్థానం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనుల విందుగా వీక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి నూతన పట్టు వస్త్రాలు సిరిపురం చేనేత సహకారం సంఘం వారు సమర్పించగా, తలంబ్రాలు గ్రామపంచాయతీ తరపున సమర్పించారు. కళ్యాణం అనంతరం 1996-97 సంవత్సరం పూర్వ విద్యార్థులు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అప్పం రామేశ్వరం దంపతులు, రామాలయ చైర్మన్ అప్పం రామేశ్వరం,సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్,ఉప సర్పంచ్ మూడుదుడ్ల అనుష,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి,మాజీ జెడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్,మాజీ సర్పంచ్ బడుగు రమేష్,కట్ట దశరథ్ రెడ్డి, జెల్లా లక్ష్మీనారాయణ,మరియు వార్డు సభ్యులు మరియు ఆలయ ధర్మకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: