ఇందల్వాయిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
* పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
* వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సాగిన కల్యాణ వైభోగం
విశ్వంభర, నిజామాబాద్: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇందల్వాయి గ్రామంలోని ప్రసిద్ధ సీతారామచంద్ర ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి కల్యాణం వైభవంగా సాగింది. ప్రజలందరి పై ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించి ,వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయానికి సంబంధించి పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్,సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి పొలసాని శ్రీనివాస్,రాంచందర్ గౌడ్,అంబర్ సింగ్,స్థానిక గ్రామ సర్పంచ్ గంగామణి-గంగారం,వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



