కొలనుగూడలో హైమాస్ట్  లైట్లు 

కొలనుగూడలో హైమాస్ట్  లైట్లు 

 విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం కొలనుగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వర నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  సహకారంతో ఐదు  హైమాస్ట్ లైట్లు  ఏర్పాటు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ రాజు తెలియజేశారు.  అలాగే  గ్రామ శాఖ అధ్యక్షుడు బండ వేణుగోపాలకృష్ణ,  వీరందరూ ప్రత్యేక చరవతో  గ్రామానికి లైటింగ్ వచ్చే విధంగా సహకరించినందుకు  వర్కింగ్ ప్రెసిడెంట్ బండరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బండ విజయ శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సలీం, బండ కిష్టయ్య, ఆధార్ల మహేందర్, ఆధార్ సామయ్య, సయ్యద్ జహంగీర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: