కల్వకోలులో ఘనంగా  సీతారాముల కళ్యాణం

కల్వకోలులో ఘనంగా  సీతారాముల కళ్యాణం

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం  మండలం కల్వకోలు గ్రామంలో సీతారాముల కల్యాణ ఉత్సవం వైభోగంగా ఎంతో ఘనంగా  జరిగింది,  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కల్వకోలు గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీతారాములు మా గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ అధ్యక్షులు సాయిని జెపాల్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ జనార్దన్ గౌడ్,  వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు కాసాని ఆనంద్ గౌడ్, పెండాల్ నరసింహ, చెన్నయ్య, వెంకటేష్, రమేష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: