అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, జిహెచ్ఎంసి : స్వయంభూ శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయములోని శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకము, అలంకారము, ఎదుర్కోళ్ళు అనంతరము శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యానోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీ సమేతంగా ఆలయమునకు విచ్చేసి స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్ శ్రీ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు కూడా స్వామి, అమ్మవార్లకు తలంబ్రాలు సమర్పించారు. అసంఖ్యాకంగా విచ్చేసిన భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. భక్తుల సౌకర్యార్థము రెండు ఎల్.ఇ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేసి కళ్యాణోత్సవాన్ని స్పష్టంగా చూసే అవకాశాన్ని కల్పించారు. భక్తుల సౌకర్యార్థము మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదము, అన్నదానములు ఏర్పాటు చేయడం జరిగీంది. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్ శ్రీ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గారెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె. కవిత, ఓరుగంటి నరేష్, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి, యం. రాజేశ్వరి పాల్గొన్నారు.



