గెలిచిన వెంటనే ప్రభుత్వంపై యుద్దం స్టార్ట్ చేస్తాం
-కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
- నమ్మక ద్రోహానికి...పోరాటానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి...
- బీజేపీ అంటేనే బీసీల పార్టీ...
విశ్వంభర, కరీం నగర్ : నమ్మక ద్రోహాం నయవంచనకు, పోరాటాలకు, ధర్మ రక్షణకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నయవంచన, నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్, టీచర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ సర్కార్ పై యుద్దం ఆరంభిస్తామని ప్రకటించారు. తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యాం కానేకాదని, ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. మంత్రిగా ఉంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన హైదరాబాద్ లో ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ...ఇయాళ బీసీ జపం చేయడం సిగ్గు చేటన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.



