బాగా చదవండి రూ.5 లక్షలు గెలవండి:   సర్పంచి కుమార్

బాగా చదవండి రూ.5 లక్షలు గెలవండి:   సర్పంచి కుమార్

విశ్వంభర,ఇనుగుర్తి: బాగా చదివి రాష్ట్రంలో ప్రథమంగా నిలిచి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అందజేసే ప్రోత్సాహకం రూ.5 లక్షల నగదు గెలుచుకోవాలని సర్పంచి తంగడపల్లి కుమార్  విద్యార్థులకు సూచించారు. ఇనుగుర్తి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో  బాల బాలికలను మరింత ప్రోత్సహించాలని'మిషన్ టెన్త్ క్లాస్ చదువుకో తెలంగాణ' కార్యక్రమాన్ని  ఇన్చార్జి హెచ్ఎం అమ్మ యాకయ్య అధ్యక్తన మంగళవారం నిర్వహించారు. శ్రీరామ్ జిల్లా మేనేజర్ శరత్ కుమార్ మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా  విద్యార్థుల్లోని  ప్రతిభను ప్రోత్సహించడానికి  రాష్ట్ర ప్రథమ రూ.5 లక్షలు, ద్వితీయ రూ.3 లక్షలు, జిల్లా టాపర్ కు రూ.2లక్షలు, నియోజకవర్గ టాపర్ కు రూ.1లక్ష, 612 మండలాలకు 10,000 చొప్పున నగదు అందజేయనున్నట్లు  లిపారు. కార్యక్రమంలో  చీన్య తండా సర్పంచి జాటో హరిచంద్, దిశా కమిటీ మెంబర్ బాబురావు,మహేందర్ రెడ్డి,రామ్మూర్తి, ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి యాదగిరి అమీనా కౌసర్,ప్రవీణ్, ఉప్పలయ్య,ప్రణయ్,స్టూడెంట్స్ పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews