మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై  డీజీపీ వీడియో కాన్ఫరెన్సు 

మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై  డీజీపీ వీడియో కాన్ఫరెన్సు 

 విశ్వంభర,సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు లీగల్ అవగాహన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ నరసింహ , జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికలను పూర్తి శాంతియుతంగా,  పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లను  బైండోవర్ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాన కలిగి ఉండాలని, ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. విజేత ర్యాలీలపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలు, భద్రత పరమైన అంశాల గురించి, బందోబస్తు ఏర్పాట్లు గురించి, పోలింగ్ సామాగ్రి భద్రత, స్ట్రాంగ్ రూమ్ ల భద్రత, గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడ్డ వారిపై చర్యలు, ప్రలోభాల నివారణ, చెక్ పోస్ట్ లలో తనిఖీల గురించి ఎస్పి నరసింహ  వివరించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్, ఫలితాల అనంతరం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతులు ఇవ్వడంలేదు అని, డీజే లపై నిషేదం ఉన్నదని తెలిపినారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ  రవీందర్ రెడీ, డీఎస్పీలు  ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సీఐలు వెంకటయ్య, రామారావు, ఎలక్షన్స్ సెల్ ఎస్ఐ లు రాంబాబు, అనిల్ రెడ్డి, పోలీస్ ఐటి కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews