ఇంటర్ విద్యార్థినికి  పాముకాటు

ఇంటర్ విద్యార్థినికి  పాముకాటు

విశ్వంభర,ఇనుగుర్తి: ఆరవేసిన బట్టలు తీస్తున్న బాలికను పాము కాటు వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని అస్మిత ను మంగళవారం పాము కాటు వేసింది. ఆరవేసిన బట్టలు తీస్తున్న క్రమంలో అంతకమునుపే అక్కడ పొంచి ఉన్న పాము విద్యార్థిని చేతిపై కరిచింది. దీంతో 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

Tags: