సార్వత్రిక  సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక  సమ్మెను జయప్రదం చేయండి

  • సిఐటియు జిల్లా  ఉపాధ్యక్షుడు నాగన్న 

విశ్వంభర, మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక  సమ్మెను  జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా  ఉపాధ్యక్షుడు  కుమ్మరి కుంట్ల నాగన్న చెప్పారు. ఈ మేరకు రంగం అడ్డాల  దగ్గర విస్తృతంగా కరపత్రాలు పంచుతూ ప్రచార  నిర్వహించారు.ఈ సందర్బంగా  కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ, బిజెపి  తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని,  వి బి జి రామ్ బిల్లును రద్దుచేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం  కల్పించాలని  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు   పుచ్చకాయలు ఎల్లయ్య, ఇమ్మడి పద్మ, అర్చన, రాము, విజయ్, చిరంజీవి, రాజు, పద్మ , మంజుల,. వెంకటేష్, మోహన్, భాస్కర్ ,నాగేశ్వరావు, మంజుల ,రాణి ,విజయ, ధనమ్మ ,వినయ్, భాస్కర్, ఉపేంద్ర, రాణి, తదితరులు పాల్గొన్నారు

Tags:  

Advertisement

LatestNews