బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి

బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి

  • చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్ 

విశ్వంభర, చింతపల్లి :  గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాలని చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్ అన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం (ఐసిపిఎస్) ఆధ్వర్యంలో మంగళవారం బీసీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గ్రామ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విధిగా బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు బాలల హక్కుల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Tags:  

Advertisement

LatestNews