చిన్నారులకు సర్పంచి హేమలత దుస్తుల వితరణ

చిన్నారులకు సర్పంచి హేమలత దుస్తుల వితరణ

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని నల్లగుట్ట తండా సర్పంచి గుగులోతు హేమలత శ్రీను నాయక్ స్థానిక అంగన్వాడి బాల,బాలికలకు దుస్తులు,స్లేట్స్, నోట్ బుక్స్ వితరణ చేశారు. స్థానిక ఉపసర్పంచి గుగులోతు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణారెడ్డి, టీచర్ భద్రకాళి లతో కలిసి గురువారం సర్పంచి హేమలత శ్రీను నాయక్ చిన్నారులకు సంబంధిత మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అంగన్వాడీలలో చిన్నారుల సంఖ్య పెంచడానికి తాము చేయూతనిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు, తల్లులకు, గర్భిణీలకు, కిశోర బాలికలకు ప్రభుత్వం ద్వారా ఐసీడీఎ ఎస్ నుంచి సరఫరా చేసే పోషకాలతో కూడిన ఫీడింగును సద్వినియోగం చేయాలని అంగన్వాడీలకు సూచించారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పేరెంట్స్ తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బానోతు సక్కుబాయి,సీనియర్ నాయకులు గుగులోతు రాజు నాయక్,శ్రీనివాస్,మంగు నాయక్,బానోతు వెంకన్న,గుగులోతు రవి,ఆయా మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-sarpanchi-hemalatha-clothes-to-girls/article-18430

Tags: