శ్రీరాముడి పేరుతో రాజకీయాలు మానుకోవాలి: హేమా సుదర్శన్

విశ్వంభర, హైదరాబాదు : శ్రీరాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆయన చూపిన ధర్మం, న్యాయం, సత్యం విలువలను పాలనలో ఆచరించాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు. అయోధ్య రామమందిరం రూ.200 కోట్ల నిధుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా విచారించి నిజాలను దేశ ప్రజల ముందుంచాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. శ్రీరాముడు, శ్రీ ఆంజనేయస్వామి వంటి హిందూ దేవతలను రాజకీయ లేదా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆమె పేర్కొన్నారు. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచి, శ్రీరాముడు బోధించిన విలువలను పాలనలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hema-sudarshan-should-avoid-politics-in-the-name-of-sri/article-18424

Tags: