మైనర్ బాలికపై అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
విశ్వంభర, మహబూబాబాద్: రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని కలచివేస్తున్నాయని, మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. బాలికపై దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యాచార బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించి న్యాయం చేయాలని గిరిజన సామాజిక చైతన్య వేదిక తరఫున డిమాండ్ చేశారు.